పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

by Elthuri vijay kumar |

పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీఈవో సురేష్ చందర్ గౌడ్ సూచించారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
X

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి

- నర్సరీలలో మొక్కలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

- ఎంపీఈఓ సురేష్ చందర్ గౌడ్

దిశ, లోకేశ్వరం: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీఈవో సురేష్ చందర్ గౌడ్ సూచించారు. ఇటీవల ఎంపీఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శనివారం మండలంలోని నగర్, పిప్రి, గడ్ చందా, బామ్ని (కె) గ్రామాల్లో పర్యటించారు. ముందుగా గ్రామపంచాయతీల్లో రికార్డులను పరిశీలించి కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. మురుగు కాలువలను తరచూ శుభ్రం చేయించాలని, పనిచేయని వీధి దీపాలకు వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. అలాగే హరితహారం నర్సరీల్లో మొక్కలు చనిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆయనతోపాటు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story