- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచాయతీ ఎన్నికలు.. ఆ ఇద్దరు నేతలకు ఓ సవాల్..
పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇద్దరు నేతలకు అగ్నిపరీక్షగా మారింది.

దిశ ప్రతినిధి, నిర్మల్: పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇద్దరు నేతలకు అగ్నిపరీక్షగా మారింది. ఒకరేమో ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా.. మరొకరు బీజేపీ జాతీయ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తూర్పు జిల్లాకు సంబంధించి మంత్రి గడ్డం వివేకానంద అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుండగా... పశ్చిమ జిల్లాలో జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. చెన్నూరు, నిర్మల్ నియోజక వర్గాలకు సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో వీరి ప్రాబల్యంపై ఆసక్తి నెలకొంది.
అటు మంత్రి... ఇటు ప్రతిపక్ష నేత...
గ్రామపంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరు నేతలకు అత్యంత కీలకంగా మారుతున్నాయి భవిష్యత్తులో తమ ఉనికి కాపాడుకోవడంతోపాటు ఉన్నతస్థాయి పదవులకు ఎదగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రాబల్యం చాటుకునే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న... నానుడి మేరకు మంత్రిగా కొనసాగుతున్న గడ్డం వివేక్, ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు తమ ప్రభావం చూపుతారన్న ఆసక్తి ఆ రెండు నియోజకవర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకుల్లో నెలకొంది. తాము శాసనసభ్యుల హోదాతో పాటు మంత్రిగా, పక్ష నేతగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయాల్లో తమ పరపతిని చాటుకునేందుకు ఎన్నికలు ఒక కొలమానంగా మారుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చెన్నూరు, నిర్మల్ కీలకం...
మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థలపై ఆధిపత్యం సాధిస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. స్థానిక సంస్థల్లో తమ బలం చాటుకోలేకపోతే... రాష్ట్రస్థాయిలో పెద్ద హోదాలో ఉన్న ఒక మంత్రి ఒక ప్రతిపక్ష నేత తమ ప్రాభవం కోల్పోయే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.






