బుద్ధుడు చూపిన శాంతిమార్గంలో నడవాలి : పూజ్య భంతే కమల్ ధమ్మో

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఇంద్రవెల్లి : గౌతమ బుద్ధుడు చూపిన శాంతి మార్గంలో నడిచి ప్రశాంత జీవనం గడపాలని పూజ్య భంతే కమల్ ధమ్మో సూచించారు. మంగళవారం

బుద్ధుడు చూపిన శాంతిమార్గంలో నడవాలి : పూజ్య భంతే కమల్ ధమ్మో
X

దిశ, ఇంద్రవెల్లి : గౌతమ బుద్ధుడు చూపిన శాంతి మార్గంలో నడిచి ప్రశాంత జీవనం గడపాలని పూజ్య భంతే కమల్ ధమ్మో సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని సట్వాజీగూడ గ్రామంతో పాటు మిలింద్ నగర్, భీంనగర్ కాలనీల్లో 69వ ధమ్మ చక్ర పరివర్తన్ దివస్, వర్షవాస్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సట్వాజీగూడ గ్రామం నుంచి మిలింద్ నగర్ నుంచి బౌద్ధ ఉపాసకులు బుద్దుడుగ్రంథతో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించార‌రు. బుద్ధ వందన, ధమ్మ వందన, సంఘ వందన స్వీకరించారు. ఈ సందర్భంగా పూజ్య భంతే కమల్ ధమ్మో మాట్లాడుతూ బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. బుద్ధుని బోధనలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరం అన్నారు. బుద్దుడు చూపిన మార్గం నేడు ప్రపంచమంతా ఆచరిస్తున్నారని.. ప్రజ్ఞా, శీలం, కరుణ అనే అంశాలపైనే మనిషి జీవనశైలి ఆధారపడి ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సోన్ కాంభ్లే జితేంధర్, భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పరత్వాగ్ సందీప్, మండల అధ్యక్షులు సూర్యవంశీ ఉత్తం, నాయకులు వాగ్మారే కామరాజ్, సూర్యవంశీ గణేష్, గిల్చే నారాయణ, ఆనంద్‌రావు, సోమోరే గౌతమ్ పాల్గొన్నారు.

Next Story