కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ దే అధికారం : అమిత్ షా

by Disha Web Desk 11 |
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ  దే అధికారం : అమిత్ షా
X

దిశ, కాగజ్నగర్ : కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వస్తుందని, ఎన్డీఏ కు 400 సీట్లు వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో బీజేపీ వికాస సంకల్ప సభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే ఎన్నికలు జరిగిన చోట్ల వంద సీట్లు సాధించామని, మరో 150 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ సర్కార్ వస్తుందని జోష్యం చెప్పారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలుస్తామని, ఒకవైపు మోడీ మరోవైపు రాహుల్ పోటీలో ఉన్నారన్నారు. బిజెపి ఎండ వేడిమి తట్టుకోలేక రాహుల్ గాంధీ బ్యాంకాక్ వెళ్లిపోయే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రజల గురించి ఖర్గే కు ఏం తెలుసు అని అన్నారు. దీపావళి రోజున సైనికులతో స్వీట్లు తినేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ నేఅని తెలిపారు. రాహుల్ గాంధీ ఓవైసీ ఓటు బ్యాంకు ఒకటేనన్నారు. బిజెపిది ఆదివాసి, గిరిజనుల ఓటు బ్యాంకు అని పేర్కొనారు. అయోధ్య రామమందిర నిర్మాణం బిజెపి నిర్మించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు పరిపాలించిన రామ మందిరాన్ని నిర్మించి లేదన్నారు. ఎస్టీ, బీసీల రిజర్వేషన్లపై నా వ్యాఖ్యలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వక్రీకరించారు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్య పోటీ ఉండనుందని తెలిపారు. బీజేపీని భారీ మెజారిటీతో కమలం పువ్వుకు ఓటు వేసి మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు భద్రత బలగాలకు మోహరించారు. ఎండను లెక్క చేయకుండా సభకు వచ్చిన ప్రజలందరికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, మహేశ్వర్ రెడ్డి, పవర్ రామారావు పటేల్, పాయల్ శంకర్, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, కొంగ సత్యనారాయణ , సత్యనారాయణ గౌడ్, నాగేశ్వరరావు, శోభారాణి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed