పాయల్ శంకర్ ఫైర్.. బీసీలను అవమానించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు

by Bhanu |

కాంగ్రెస్ పార్టీ మోసం చేసినంత ఏ పార్టీ ప్రజలను మోసం చేయలేదని, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు

పాయల్ శంకర్ ఫైర్.. బీసీలను అవమానించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు
X

దిశ, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిన తీరును ఏ ఇతర పార్టీ చూపలేదని, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కే ఆ పార్టీకి లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

బీసీలను చులకనగా చూస్తూ వ్యాఖ్యలు చేసే అధికారం కాంగ్రెస్ నేతలకు లేదని, వారి పార్టీ చరిత్రే బీసీలను దూరంగా ఉంచిన ఉదాహరణలతో నిండి ఉందని విమర్శించారు. బీసీల వాదనను గట్టిగా వినిపించగలిగే ఏకైక పార్టీ బీజేపీనే అని స్పష్టంచేశారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు ఆకుల ప్రవీణ్, ఉష్కం రఘుపతి, లాలామున్న జోగురవి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story