ఉపాధి కోసం వలస వచ్చి.. మృత్యువాత

by Ratna Kumari |

దిశ, వాంకిడి : పక్కా రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వలస వచ్చి విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమురం

ఉపాధి కోసం వలస వచ్చి.. మృత్యువాత
X

దిశ, వాంకిడి : పక్కా రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వలస వచ్చి విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని రాజుర కోనత్ పూర్ గ్రామానికి చెందిన గౌరవ్ తులసీరాం నికోడే బుధవారం భావన నిర్మాణ పనులు చేసేందుకు మండలానికి వచ్చారు. ఈ క్రమంలో గోయగాం గ్రామానికి చెందిన మాడావి వాసు కు మంజూరైన ఇందిరమ్మ ఇంటికి స్లాబ్ వేస్తుండగా.. సమీపంలోని విద్యుత్ తీగలు ఇనుప పైపుతో గౌరవ్ తులసీరాం విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అతని వాంకిడి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆసిఫాబాద్ రెఫెర్ చేయగా వైద్యులు పరిరక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అందక గౌరవ్ తులసీరాం మరణించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్యం కోసం వాంకిడీ దవాఖానా తెస్తే.. 1 గంట వరకు ఎవరూ పట్టించుకోలేదు. వైద్యం చేసేందుకు డాక్టర్లు కూడా అందుబాటులో లేరని..ఉన్న సిబ్బంది ఆసిఫాబాద్ రెఫెర్ చేశారని వాపోయారు. డాక్టర్లు సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణాలు నిలిచే వాని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story