- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
దిశ, మంచిర్యాల : రోడ్డు ప్రమాదాల నివారణకుడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా

దిశ, మంచిర్యాల : రోడ్డు ప్రమాదాల నివారణకుడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మంచిర్యాల జిల్లా లోని ఇందారం జాతీయ రహదారి బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ఇందారం క్రాస్ రోడ్డు మూలమలుపు వద్ద ఏర్పాటు చేస్తున్న ఐలాండ్ లా ఏర్పాటు డిజైన్, సీసీ కెమెరాల ఏర్పాటు, రేడియం బ్లింకర్స్, స్టడ్స్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి ప్రమాదాల నివారణకు దిశా నిర్దేశం చేశారు. రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ తరపున ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రతి ఒక్క వాహన దారుడు రోడ్డు నిబంధనలు పాటించాలని అన్నారు. బైక్ లపై త్రిబుల్ రైడ్, సెల్ఫోన్ మాట్లాడుతూ వెళ్లటం, మద్యం తాగి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. వాహన దారుడు హెల్మెట్ లేకుండా నడపడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. అరైవ్ అలైవ్ పై ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేసి ప్రమాద రహిత రామగుండం కమిషనరేట్ గా పేరు తీసుకురావాలని అన్నారు. అధికారులు ఫోర్ వే లైన్స్ పై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వివరాలను తెలుసుకున్నారు. రాత్రిపూట సిగ్నల్స్ కనబడే విధంగా పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం, మంచిర్యాల జిల్లా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రాజేశ్వర్ రావు, సత్యనారాయణ, రోడ్ సేఫ్టీ టీం ఇన్స్పెక్టర్ రమేష్ బాబు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






