- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి జిల్లాలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ కమిషనర్లు భారీగా బదిలీ అయ్యారు.

దిశ, ప్రతినిధి నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ కమిషనర్లు భారీగా బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 30 మంది కమిషనర్ల బదిలీలు జరగ్గా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎనిమిది మందికి బదిలీ జరిగింది. ప్రస్తుతం నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తున్న జగదీశ్వర్ గౌడ్ ను ఆదిలాబాద్ కు బదిలీ చేశారు. ఆదిలాబాద్ లో కమిషనర్ గా కొనసాగుతున్న సివిఎన్ రాజు మంచిర్యాల కార్పొరేషన్ కు బదిలీపై వెళుతున్నారు. పెద్దపల్లిలో పనిచేస్తున్న మామిడి లింగయ్య ను ఒ.డి విధానంలో బైంసా మున్సిపల్ కమిషనర్ గా నియమించారు.
ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న గజానంద్ ను నిజామాబాద్ జిల్లా భీంగల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మంచిర్యాలలో కమిషనర్‌గా పనిచేస్తున్న అన్వేష్ ను వేములవాడకు బదిలీ చేయగా, ములుగు మున్సిపల్ కమిషనర్ రమేష్ ను బెల్లంపల్లి కమిషనర్ గా బదిలీ చేశారు. కాగా ప్రస్తుతం బెల్లంపల్లిలో కమిషనర్ గా కొనసాగుతున్న సంపత్ ను ములుగు మున్సిపాలిటీ కమిషనర్ గా బదిలీ చేస్తుంది ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 8 మున్సిపాలిటీల కమిషనర్ల బదిలీ ఒకేసారి జరగడం ఇదే తొలిసారి. ఈ బదిలీల వ్యవహారం మున్సిపల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.






