భారీగా మొక్కజొన్న పంట దగ్ధం

by Jakkula.Mamatha |

కుబీర్ మండలంలో గురువారం రెండు గ్రామాల్లో భారీ ఎత్తున కోసిన మొక్కజొన్న పంట దగ్ధమైంది.

భారీగా మొక్కజొన్న పంట దగ్ధం
X

దిశ, కుబీర్: కుబీర్ మండలంలో గురువారం రెండు గ్రామాల్లో భారీ ఎత్తున కోసిన మొక్కజొన్న పంట దగ్ధమైంది. కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్టు స్థానికులు వాపోతున్నారు. పార్డి(కే)లో 26.14ఎకరాల్లో మొక్కజొన్న , దార్ కుబీర్‌లో 15.20ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న పంటలు నష్టం వాటిల్లింది. దీని విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని రెవెన్యూ శాఖ సిబ్బంది ప్రాథమిక అంచనా వేశారు. ఒకే రోజు 41 ఎకరాల్లో లక్షల రూపాయల విలువైన పంట బూడిదయింది. సుమారు 15 మందికి పైగా నష్టపోయారు. మంటలు చెలరేగడంతో దగ్గరికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఫైర్ ఇంజన్ మంటలను అదుపులోకి తీసుకొచ్చిన జరగాల్సిన నష్టం జరిగింది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట కన్నీళ్ళను మిగిల్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందజేయాలని విన్నవించుకుంటున్నారు.

Next Story