ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి..

by Kodari Anjali |   (  Updated:2026-04-19 14:37:03  IST  )

మద్యం మత్తులో జేసీబీ ఆపరేటర్ చెరువులో పడి మృతి చెందాడు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి..
X

దిశ, లోకేశ్వరం: మద్యం మత్తులో ప్రమాదవశాత్తు చెరువులో పడి బీహార్ రాష్ట్రానికి చెందిన జేసీబీ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. ఎస్ ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి వద్ద చోటు కుమార్ సహాని (28) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. లోకేశ్వరం మండలంలోని గోదావరి నది తీరంలో జేసీబీపై పనిచేయడానికి వచ్చిన ఆయన ఈనెల 17న అతిగా మద్యం సేవించి.. గోదావరి నది వైపు వెళ్తుండగా.. గమనించిన గ్రామస్తులు ఆయనను మందలించినట్లు తెలిపారు. కాగా ఆ రోజు నుండి ఆయన ఆచూకీ లభించకపోగా ఆదివారం పంచగుడి సమీపంలోని ఈదుల్ల చెరువులో ఆయన మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story