విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ తో మొక్క‌జొన్న పంట ఆహుతి

by Ratna Kumari |

ఆరుగాలం కష్టపడి పండించిన పంట క‌ళ్ల‌ ముందే దగ్ధం అవ్వ‌డంతో ఆ రైతు కన్నీరు మున్నీరు అవుతున్న సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని చందు నాయక్ తండాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ తో మొక్క‌జొన్న పంట ఆహుతి
X

దిశ, ఖానాపూర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంట క‌ళ్ల‌ ముందే దగ్ధం అవ్వ‌డంతో ఆ రైతు కన్నీరు మున్నీరు అవుతున్న సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని చందు నాయక్ తండాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. చందునాయక్ తండా గ్రామానికి చెందిన కౌలు రైతు గుగ్లావత్ సురేష్ రెండు ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది. పంటను కోసి కుప్ప వేస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు వలన మంటలు చెలరేగి పంట కాలి బూడిదయింది. మంటలు ఆర్పెందుకు చుట్టూ పక్కల రైతులు తమ తోటలో గల మోటార్లను తెచ్చి బావుల ద్వారా నీళ్లు పోశారు.

మంటలు కంట్రోల్ కాలేదని బాధిత రైతు వాపోయాడు. రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పంట వేసుకున్నానని, చేతికి వచ్చే సమయంలో ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అయ్యాడు. దాదాపు రూ. 2 లక్షలకు పైగా నష్టం జరిగిందని, కరెంట్ తీగలకు మంటలు వచ్చి ఇలా అయిందని, వారం రోజుల్లో పంటను అమ్ముకుని, అప్పులు తీర్చుకుందామని ఆశపడినట్లు రైతు సురేష్ చెప్పాడు. సకాలంలో దగ్గర ఉన్న రైతు వచ్చి మంటలు ఆర్పకపొతే పక్కా రైతులకు కూడ నష్టం జరిగేదని రైతు నాయకులు నిమ్యా నాయక్ తెలిపారు. పేద రైతుకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.

Next Story