- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచిర్యాల జిల్లా వాసికి మహాత్మా జాతీయ నంది పురస్కారం..
by Batti.Sumithra |
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మారం రఘు యాదవ్ మహాత్మా జాతీయ నంది పురస్కారం అందుకున్నారు.

X
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మారం రఘు యాదవ్ మహాత్మా జాతీయ నంది పురస్కారం అందుకున్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆదర్శ కళానిలయం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిర్ లో ఈ పురస్కారాన్ని తీసుకున్నారు.
రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆయనను శాలువాతో సత్కరించి మహాత్మా జాతీయ నంది పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం, మేకలు, గొర్రెలు పెంపకం వృత్తిదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జాతీయ నంది పురస్కారం అందుకున్న రఘు యాదవ్ ను పలువురు అభినందించారు.
Next Story






