- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘన్ పూర్ చెక్‌పోస్టు వద్ద మద్యం పట్టివేత...
by Bhanu |
నియోజకవర్గంలోని తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వద్ద గల ఘన్పూర్ చెక్‌పోస్టు వద్ద శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా మద్యం తీసుకువస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ జుల్ఫీకర్ హమ్మద్ తెలిపారు.

X
దిశ, బోథ్: నియోజకవర్గంలోని తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వద్ద గల ఘన్పూర్ చెక్‌పోస్టు వద్ద శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీలు చేస్తుండగా అక్రమంగా మద్యం తీసుకువస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ జుల్ఫీకర్ హమ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ...బజార్ హత్నూర్‌కు చెందిన తోట త్రిశూల్ అనే వ్యక్తి, మహారాష్ట్రకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎనిమిది బాటిళ్లను తీసుకువస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. పట్టుబడిన మద్యం విలువ రూ. 19,200 ఉంటుందని పేర్కొన్నారు. మద్యం సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర నుంచి లిక్కర్ తీసుకువచ్చినా లేదా అమ్మినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






