గోదావరి పుష్కరాలు సజావుగా నిర్వహిద్దాం

by Ratna Kumari |

రానున్న గోదావరి నది పుష్కరాలకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్ల పై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గోదావరి పుష్కరాలు సజావుగా నిర్వహిద్దాం
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : రానున్న గోదావరి నది పుష్కరాలకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్ల పై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచి పటిష్ట ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని వివరించారు. వివిధ శాఖల అధికారులతో వారి ఆధ్వర్యంలో చేపట్టబోయే పనుల గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డీపీఓ శ్రీనివాస్, డీఎంహెచ్వో రాజేందర్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story