- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుత పులి దాడి..! రెండు పశువులు మృతి
బోథ్ మండలం రఘునాథ్ పూర్, కంటేగాం అటవీ ప్రాంతంలో రెండు పశువులు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, బోథ్ : బోథ్ మండలం రఘునాథ్ పూర్, కంటేగాం అటవీ ప్రాంతంలో రెండు పశువులు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, గోపాలపేట్ గ్రామానికి చెందిన చందులాల్ తన పశువులను మేపేందుకు రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పశువులు మేపుతుండగా చిరుత దాడి చేసి లేగ దూడను పట్టుకుని తీసుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.
విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిరుత సంచారం అనుమానంతో అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అటవీకి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
అయితే ఈ పశువుల మృతికి చిరుత పులే కారణమా? లేక వేరే మృగాల దాడి వల్ల జరిగిందా అనే విషయం మాత్రం స్పష్టతకు రావాల్సి ఉంది. అటవీశాఖ అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా నిజానిజాలను నిర్ధారించేందుకు అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.






