శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి : ఎస్పీ నితికా పంత్

by Nallavelli.Anjaneyulu |

దిశ, జైనూర్ : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. ఆదివారం జైనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి : ఎస్పీ నితికా పంత్
X

దిశ, జైనూర్ : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. ఆదివారం జైనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు రిజిస్టర్, స్టేషన్ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు. జైనూర్ ఎస్‌హెచ్‌ఓ రవికుమార్, స్టేషన్ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బందీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో చట్టవ్యతిరేకచర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు.మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, లా అండ్ ఆర్డర్ విషయంలో రాత్రిపూట పర్యవేక్షణ, పికెటింగ్, ప్యాట్రోలింగ్‌ను కచ్చితంగా కొనసాగించాలని సూచించారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారి‌పై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అయన వెంట ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, జైనూర్ సీఐ రమేష్ ఉన్నారు.

Next Story