- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మావోయిస్టుకి కంటికి శస్త్ర చికిత్స చేయించిన కోటపల్లి పోలీసులు
దిశ, కోటపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారుపల్లి గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు ఆత్రం లచ్చన్న, భార్యతో కలిసి గత కొద్ది నెలల

దిశ, కోటపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారుపల్లి గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు ఆత్రం లచ్చన్న, భార్యతో కలిసి గత కొద్ది నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి సహాయ సహాకారాలను చూసి లొంగిపోయారు. మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గుర్తించి తెలుసుకుని, తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయాడు. మాజీ మావోయిస్టు కు పోలీస్ శాఖ తరుపున ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సహాయం, సమస్య ఉన్న అండగా ఉంటామని ఇచ్చిన మాట ప్రకారం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్ ఐ రాజేందర్ ఆత్రం లచ్చన్న కు కంటి చికిత్స ను మంచిర్యాల లోని పవన్ ఆప్టికల్స్ ద్వారా ఉచితంగా కంటి చికిత్స చేయించినట్టు తెలిపారు ఈసందర్బంగా చెన్నూర్ రూలర్ సీఐ మాట్లాడుతూ పోరు వద్దు ఊరు ముద్దు అనే నినాదంతో మావోయిస్టు లు ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని చెన్నూర్ రూలర్ సీఐ అన్నారు. ఇందుకు పోలీస్ శాఖ అన్నివిధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు.






