Big Alert : ఆ జిల్లాల వాసులకు బిగ్ అలెర్ట్.. దారులన్నీ మూసివేత

by Muthe.Rajitha |

ఉమ్మడి అదిలాబాద్(Adilabad) వాసులకు బిగ్ అలర్ట్. ఉమ్మడి జిల్లాలో భాగమైన ప్రస్తుత మంచిర్యాల, నిర్మల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ వాసులు ఇకపై రాత్రుల్లో సంచరించే అవకాశం లేదు.

Big Alert : ఆ జిల్లాల వాసులకు బిగ్ అలెర్ట్.. దారులన్నీ మూసివేత
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి అదిలాబాద్(Adilabad) వాసులకు బిగ్ అలర్ట్. ఉమ్మడి జిల్లాలో భాగమైన ప్రస్తుత మంచిర్యాల, నిర్మల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ వాసులు ఇకపై రాత్రుల్లో సంచరించే అవకాశం లేదు. ఆయా జిల్లాలో కవ్వాల్ అభయారణ్యం(Kawal Sanctuary) విస్తరించి ఉంది. పులులు విరివిగా సంచరిస్తున్న నేపథ్యంలో ఇక నుంచి ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్(Kawal Tiger Reserve Forest) లోకి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్థానికేతర వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు అటవీశాఖ అధికారులు. ఈ విషయాన్ని ప్రజలు సానుకూలంగా అర్థం చేసుకోవాలని ఉట్నూర్(Utnoor) డివిజన్ ఎఫ్డీవో రేవంత్ చంద్ర వెల్లడించారు. ఉట్నూరు డివిజన్‌లోని కొత్తగూడ చెక్ పోస్ట్ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎట్టి పరిస్థితిలో వాహనాలకు అనుమతి ఇవ్వమన్నారు.

రాత్రి సమయాలలో ప్రత్యామ్నాయంగా గుడిహత్నూర్ , జైనూరు గుండా వెళ్లే రహదారులను ఉపయోగించుకోవాలని సూచించారు. స్థానిక వాహనాలకు మాత్రం అనుమతి ఇస్తామని, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు చూపితే స్థానికులకు అనుమతి ఉంటుందన్నారు. అదేవిధంగా ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయింపు ఉంటుందని, ఇందులో ఆర్టీసీ బస్సులు, అంబులెన్స్, ఇతర అత్యవసర వాహనాలు వెళ్లడానికి అనుమతి ఇస్తామన్నారు. అలాగే అటవీ పర్యావరణ సెస్ చార్జీల(Forest Cess) పై స్థానికేతర వాహనాలకు మినహాయింపు ఉండదని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ఈ విషయాన్ని సానుకూలంగా అర్థం చేసుకొని అటవీ అధికారులకు సహకరించాలన్నారు.

Next Story