కర్ణాటక ఫలితాలకు తెలంగాణతో సంబంధం లేదు : బండి సంజయ్

by Dishanational2 |
కర్ణాటక ఫలితాలకు తెలంగాణతో సంబంధం లేదు : బండి సంజయ్
X

దిశ ప్రతినిధి నిర్మల్ : భారత రాష్ట్ర సమితి పార్టీకి హైదరాబాద్లోని కోకాపేటలో భూమి కేటాయించడం అంటే నూటికి నూరు శాతం దోపిడీకి పాల్పడ్డ ట్లేననిబీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. కోకాపేటలో గజం భూమి ధర లక్ష రూపాయలు ఉందని 100 కోట్లకు పైగానే ఉందని దీన్నిబట్టి అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ కేబినెట్ లో ధరలతో తమ పార్టీ పేరుతో భూమిని కేటాయిస్తూ తీర్మానం చేయడం చూస్తే పక్కాగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం దోపిడీలకు పాల్పడుతున్నట్లు అర్థం అవుతుందన్నారు.

ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ సోయం బాపూరావు కుమారుడు పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడారు.గతంలో కాంగ్రెస్ పార్టీ దోపిడీకి పాల్పడితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రూపంలో దోపిడీకి పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు ఆ రెండు పార్టీలు ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైందని వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం వాస్తవం అన్నారు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు రాష్ట్రంలో అవినీతి భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే బండి సంజయ్ పేర్కొన్నారు కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి బిజెపికి వచ్చిన ప్రతికూల ఫలితాలతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు తెలంగాణలో బిజెపి అత్యంత బలంగా ఉందని వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయం అన్నారు విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ పార్టీ నేతలు సుహాసిని రెడ్డి పాల్గొన్నారు


Next Story