ప్లెక్సీలతో ఇబ్బందులు

by Disha Web Desk 20 |
ప్లెక్సీలతో ఇబ్బందులు
X

దిశ, రామకృష్ణాపూర్ : ఒకప్పుడు రాజకీయ నాయకులు, ఇతర వ్యాపార సంస్థలు వారి వారి ప్రచారాల కోసం ప్రచార బోర్డులను ఏర్పాటు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పదిమందికి తెలిసేలా ప్లెక్సీలు కట్టడం ట్రెండ్ గా మారింది. పుట్టినరోజు, పెళ్లిరోజు, కర్మలు, సంవత్సరీకాలు ఇలా ఒక్కటేమిటి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలో కనిపిస్తున్నాయి. ఇక చనిపోయిన వారి ఫోటో ప్లెక్సీలనైతే దశదిన కర్మ అని, సంవత్సరీకం అని పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో, రహదారుల మధ్యలో, కరెంటు ఫోల్స్, సీసీ కెమెరాల స్తంభాలు, బస్టాండ్ షెడ్లకు, ఆసుపత్రిలకు, ఆలయాల ముఖద్వారల ముందు, నాయకుల విగ్రహాలను వదలకుండా కడుతున్నారు.

దాంతో పట్టణ ప్రజలు కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే రామకృష్ణాపూర్ పట్టణంలో కూడా వేల ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. అయినప్పటికీ రామకృష్ణాపూర్ పురపాలక సంఘం అధికారులు మాత్రం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తెల్లవారుజామున ఆలయాలకు వెళ్లే భక్తులు, శుభకార్యాలకు వెళ్లేవారు ఈ ప్లెక్సీలు చూసి అశుభంగా భావిస్తు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఫ్లెక్సీలను ఉపయోగించడానికి వీలు లేదని ఒక పక్క ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పుర అధికారులకు పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పుర అధికారులు ప్లెక్సీ లను తొలగించి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పుర ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed