బ్యాక్లాగ్ డిగ్రీ విద్యార్థులకు అవస్థలు పెట్టిస్తున్న తీరు..!

by Disha Web Desk 20 |
బ్యాక్లాగ్ డిగ్రీ విద్యార్థులకు అవస్థలు పెట్టిస్తున్న తీరు..!
X

దిశ, కుబీర్ : కాకతీయ యూనివర్సిటీ నిబంధనలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. డిగ్రీలో సెమిస్టర్ విధానం రాకముందు బ్యాక్లాగ్ విద్యార్థులకు పరీక్షలు రాసుకోవడానికి యూనివర్సిటీ అనుమతించింది. పరీక్ష రాసి రాసుకోవడానికి అనుమతి ఇవ్వడం అభినందనీయమైన పరీక్ష ఫీజులను భారీగా పెంచే విద్యార్థుల నడ్డి విరుస్తున్నది. సంవత్సరానికి ప్రొఫెషనల్ ఫీజుగా మూడు వేల రూపాయలు పరీక్ష ఫీజు సబ్జెక్టుకు 4000 రూపాయలను భారీగాపెంచిన విషయం తెలిసిందే.

అనుమతి కోసం యూనివర్సిటీకి వెళ్ళాలట..

ప్రొఫెషనల్ ఫీజు సంవత్సరానికి రూ.3,000 విద్యార్థులు చెల్లించడం భారం. ఆ ఫీజును చెల్లించడానికి యూనివర్సిటీ వెళ్లి అనుమతి తీసుకొని రావాలి. ఆ తర్వాతనే కాలేజీలో పరీక్ష ఫీజు చెల్లించాలి అన్న నిబంధన కేయూ విధించింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేకనే అప్పట్లో పరీక్ష ఫీజులు చెల్లించలేక ఆర్థిక భారంతో పరీక్షలు రాయకుండా విద్యార్థులు మానుకున్నారు. బ్యాక్లాగ్ విద్యార్థులకు అనుమతించడం కొంత ఊరట కలిగించినా, నిలిచిపోయిన డిగ్రీపూర్తి చేసుకుందామన్న ఆశతో అప్పులు చేసి చదివిన కాలేజీలో ఫీజు కడదాము అనుకున్నారు. యూనివర్సిటీకి వెళ్లి ప్రొఫెషనల్ ఫీజు చెల్లించాలన్న నిబంధనలను యూనివర్సిటీ ఇటీవల జారీ చేసింది.

పరీక్ష ఫీజులు చెల్లించడానికి కాలేజీకి వెళ్లిన విద్యార్థులకు వార్త తెలిసి పిడుగు పడినట్లు అయింది. ప్రొఫెషనల్ ఫీజు చెల్లించడమే ఆర్థిక భారం కాక, యూనివర్సిటీకి వెళ్ళే రావాలంటే ఆర్థిక భారం తలకు మించిన భారంగా మారిందని విద్యార్థులు అంటున్నారు. ప్రొఫెషనల్ ఫీ ఒక దగ్గర పరీక్ష ఫీజు మరో దగ్గర చెల్లించడమేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీ వెళ్లి రావడానికి ప్రయాణ ఖర్చులు తడిసి మోబడయితాయని విద్యార్థులు అంటున్నారు. పేద విద్యార్థుల పరిస్థితులను అర్థం చేసుకొని అర్ధాంతరంగా నిలిచిపోయిన డిగ్రీని చదువులు పూర్తి చేసుకునే విందుకు సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులుస్పందించి ప్రొఫెషనల్ ఫీజును రద్దు చేయాలని పరీక్ష ఫీజులను తగ్గించాలని గడువును పొడిగించాలని, బ్యాక్లాగ్ డిగ్రీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed