- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కార్ దవాఖానాల్లో స్టాప్ నర్సులే దిక్కా..?
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ల కొరత రానుంది.

దిశ, ఆసిఫాబాద్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ల కొరత రానుంది. ఇప్పటికే ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో డాక్టర్లు లేక.. నామ మాత్రపు వైద్యసేవలతో ప్రజల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్లలో సగానికి సగం మంది ఉన్నత చదువుల కోసం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో 45 మంది డాక్టర్లు అవసరం ఉండగా 24 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 11 మంది ఈ నెలాఖరులో ఉన్నత చదువుల కోసం పీజీకి వెళ్తున్నారు. ఇక మిగిలేది 13 మంది డాక్టర్లు మాత్రమే. దీంతో జిల్లాలోని పీహెచ్ సీలకు 24 గంటల పాటు రోగులకు వైద్య సేవలు అందించేందుకు స్టాఫ్ నర్సులే దిక్కు కానున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఎండాకాలం, వచ్చే వాన కాలంలో వ్యాధులు పెరిగే ప్రమాదం ఉంది. జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పీహెచ్సీలు ఉండగా రెండు అర్బన్ హాస్పిటల్ ఉన్నాయి. ఇందులో ప్రతి పీహెచ్సీకి ఇద్దరి నుంచి ముగ్గురు డాక్టర్లు కావాలి.
కానీ జిల్లాలో పూర్తిస్థాయిలో డాక్టర్లు లేక ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల ఇప్పటికే ప్రజలకు వైద్యసేవలు అందటం లేదనే వాదన ఉంది. ఈ క్రమంలో ఉన్నవారిలో 11 మంది డాక్టర్లు వెళ్లి పోతుండటంతో చాలా ఆసుపత్రిల్లో డాక్టర్ల కొరత ఏర్పడనుంది. జిల్లాలో వైద్య సేవల నిర్వహణ పై తీవ్రప్రభావం పడనుంది. అలాగే పీహెచ్ సీల్లో కొత్త డాక్టరు వచ్చేంత వరకు స్టాప్ నర్సులు, వైద్యసిబ్బందే రోగులకు వైద్య సేవలు అందించనున్నారు. అసలే డాక్టర్ల కొరతతో అల్లాడుతున్న పీహెచ్ సీలకు..! ఉన్న డాక్టర్లలో ఒకరిద్దరూ లీవ్ పెడితే స్టాప్ నర్సులే దిక్కుగా మారనున్నారు. మరోవైపు హాస్పిటల్లో రోగులకు వైద్య సేవలు నామమాత్రంగానే అందే అవకాశాలు ఉన్నాయి. పీహెచ్ సీల్లో డాక్టర్లు లేకపోవడంతో ఏజెన్సీ సామాన్య ప్రజలు ఆర్ఎంపీ డాక్టర్ బాట పట్టే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
కాంట్రాక్ట్ డాక్టర్ నియామకాల కు చర్యలు..
జిల్లాలో సగం మంది డాక్టర్లు పీజీ చదువు కోసం వెళ్తుండటంతో వారి స్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో డాక్టర్లను తీసుకునేందుకు కలెక్టర్ తో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు. ఎండాకాలంతో పాటు వచ్చే వానకాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో డాక్టర్ లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అధికంగా కనిపిస్తుంది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం... డీఎంహెచ్వో సీతారాం..
డాక్టర్లు పీజీ ఉన్నత చదువుల కోసం వెళుతున్న క్రమంలో వారి స్థానంలో కాంటాక్ట్ డాక్టర్ల నియామకాల కోసం ఉన్నతాధికారులు. దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాలు రాంగానే కలెక్టర్ సూచనతో కాంటాక్ట్ డాక్టర్లు నియామకాలు నోటిఫికేషన్ చేస్తాం. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డాక్టర్లతో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం.






