రేషన్ బియ్యాన్ని విక్రయించిన లబ్ధిదారులకు షాక్

by Bhanu |

సన్న బియ్యాని అక్రమంగా వికయించిన తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు.

రేషన్ బియ్యాన్ని విక్రయించిన లబ్ధిదారులకు షాక్
X

దిశ, తాండూర్ : సన్న బియ్యాని అక్రమంగా వికయించిన తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు.మండలంలోని అచలాపూర్ గ్రామానికి చెందిన 11 మంది తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసినట్లు తాండూర్ తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్ పఠాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అచలాపూర్ గ్రామానికి చెందిన కుంకుమొట్టి మహేష్ కు రూ.16 కిలో చొప్పున మొత్తం 1.91 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని లబ్ధిదారులు విక్రయించారు. దాదాపు వారం రోజుల క్రితం కుంకుముట్టి మహేష్ ఇంట్లో తనిఖీ చేయగా లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన 1.91 (ఒక క్వింటాల్ 91 కిలోలు) క్వింటాళ్ల సన్నబియ్యాని స్వాధీనం చేసుకున్నట్లు తహసిల్దార్ పేర్కొన్నారు.


కలెక్టర్, పౌరసరఫరా శాఖ అధికారి ఆదేశాల మేరకు సన్న బియ్యం విక్రయించిన 11 మంది లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేశామన్నారు. సన్న బియ్యాన్ని కొనుగోలు చేసిన మహేష్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తాండూర్ ఎస్సైకి ఫిర్యాదు చేసినట్టు తహసిల్దార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియాన్ని లబ్ధిదారులు విక్రయించిన, ఎవరైనా కొనుగోలు చేసిన చర్యలు తప్పవని తహసిల్దార్ ప్రకటనలో హెచ్చరించారు.


Next Story