బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు తీర్పు.. కాంగ్రెస్ కి చెంపపెట్టు : జాతీయ బీసీ హ‌క్కుల పోరాట స‌మితి నాయ‌కులు

by Nallavelli.Anjaneyulu |

దిశ, మంచిర్యాల : మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి బీసీల 42 శాతం రిజర్వేషన్ల పై హైకోర్టు ఇచ్చిన స్టే కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి

బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు తీర్పు.. కాంగ్రెస్ కి చెంపపెట్టు : జాతీయ బీసీ హ‌క్కుల పోరాట స‌మితి నాయ‌కులు
X

దిశ, మంచిర్యాల : మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి బీసీల 42 శాతం రిజర్వేషన్ల పై హైకోర్టు ఇచ్చిన స్టే కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, గజేల్లి వెంకటయ్య పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐ.బి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చుని అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు. దీనిలో భాగంగా 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రగాడ్ బాలు పలికిన కాంగ్రెస్ పార్టీ తీర హైకోర్టుకు వెళ్లి ఆబాసు పాలైయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను లబ్ధి పొందాలని చేసిన కుట్రలు ఆ పార్టీకి చెంపపెట్టుల మా రాయన్నారు. 50 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఏ ఒక్క సారి కూడా బీసీ అంశాన్ని ప్రధాని, కేంద్ర మంత్రులకు, అఖిలపక్ష నాయకుల దృష్టికి తీసుకుపోలేదు అన్నారు. బీసీ పక్షపాతి అని చెప్పుకుంటున్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఏనాడు బీసీల రిజర్వేషన్లపై పార్లమెంటులో లేవనెత్తిన సందర్భం లేదన్నారు. బిజెపి పార్టీ కూడా బీసీల వ్యతిరేక పార్టీనె కాని మేము రిజర్వేషన్ల కు మద్దతు అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు ఏనాడు రిజర్వేషన్లపై పట్టించుకున్న పాపాన పోలేదాన్నారు. టిఆర్ఎస్ పార్టీ కూడా బీసీల కు 42 శాతం రిజర్వేషన్లపై కల్లిబొల్లి మాటలు చెబుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటివరకు నిర్వహించకపోవడంతో గ్రామ పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం వల్ల హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేముల అశోక్, చెలిమెల అంజయ్య, రాగి రాజేష్, నరసయ్య, చంద్రగిరి, చంద్రమౌళి, వేణుగోపాల్, బిక్షపతి, సతీష్, శ్రీనివాస్, రాజమౌళి పాల్గొన్నారు.

Next Story