- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెరుగుతున్న గన్ కల్చర్.. నాలుగు రోజుల వ్యవధిలో రెండు ఘటనలు
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గమైన సిర్పూర్ కాగజ్ నగర్ లో రోజు రోజుకు గన్ కల్చర్ పెరిగిపోతోంది. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో ఈ తరహా రెండు

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గమైన సిర్పూర్ కాగజ్ నగర్ లో రోజు రోజుకు గన్ కల్చర్ పెరిగిపోతోంది. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో ఈ తరహా రెండు సంఘటన చోటు చేసుకోవడంతో కలకలం సృష్టించాయి. చింతలమానేపల్లి మండలంలోని రణవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న జాడి దర్శన రణవెల్లి గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసింది. అయితే శనివారం ఉదయం సదరు మహిళ అభ్యర్థి మామ బాపు ఉదయం పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లి గుర్తు తెలియని ఓ వ్యక్తి స్కూటీపై వచ్చిన దళం పేరుతో ఓ లెటర్ ఇచ్చి.. నామినేషన్ వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే ప్రాణహాని ఉందని గన్ తో బెదిరించినట్లు బాధితుడు చెప్పారు. ఈ మేరకుబాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు దళం పేరుతో ఇచ్చిన లెటర్ ను పరిశీలించి ఫేక్ లెటర్ గా గుర్తించగా.. గన్ తో బెదిరింపు వ్యవహారంపై కౌటాల సీఐ సంతోష్ కుమార్ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల వ్యవధిలో రెండు ఘటనలు
సిర్పూర్ నియోజకవర్గంలో గన్ బెదిరింపులతో అటూ వ్యాపారులు ఇటూ ప్రజలు హడలెత్తిపోతున్నారు. గత నెలలో వరుస దొంగతనాల తో బెంబేలెత్తిపోగా గన్ బెదిరింపులు జరగడంతో నియోజకవర్గ ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గత మంగళవారం కౌటాల మండలంలోని ఓ ఫర్టిలైజర్ వ్యాపారిని ఫోన్ చేసి 50 లక్షలు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిన్ను నీ కుటుంబాన్ని తుపాకీతో కాల్చి చంపుతామని బెదిరించడంతో పాటు షాపుకు లెటర్ సైతం పెట్టారు. సదరు వ్యాపారి స్పందించకపోవడంతో వ్యాపారి తమ్ముడిపై కాల్పులు జరపగా అతను తృటిలో తప్పించు కున్నాడు. ఇదే క్రమంలో డిసెంబర్ 2 మంగళవారం ఉదయం వ్యాపారిని అతని షాపులో నే హతమార్చా లనే ఉద్దేశంతో దుండగుడు పిస్తాల్ మూడు బుల్లెట్ తీసుకుని బైక్ పై వెళ్తుండగా ఎన్నికల సందర్భంగా తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసి. అతని నుంచి ఒక పిస్తాల్.ఒక తపంచా. దేశికట్ట.రెండు మ్యాగజిన్ల లు. 15 చిన్న బుల్లెట్లు. ఒక పెద్ద బుల్లెట్. ఐదు ఖాళీ కోకలు. సెల్ ఫోన్ బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు శనివారం చింతల మానే పల్లి మండలంలోని రణవెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మహిళ అభ్యర్థి జాడి దర్శన నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని. సదరు మహిళ మామ బాపుకు గుర్తుతెలియని ఓ వ్యక్తి స్కూటీ పై వచ్చి..దళం పేరుతో ఓ లేఖతో పాటు గన్ తో బెదిరించినట్లు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కలకలం సృష్టించింది.






