ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా

by Ratna Kumari |

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, లారీల కొరత లేకుండా చూస్తున్నామని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి : కలెక్టర్  భవేష్ మిశ్రా
X

దిశ, మామడ : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, లారీల కొరత లేకుండా చూస్తున్నామని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం మండలంలోని న్యూస్పాంగి ఎక్స్ రోడ్డు వద్ద లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు పంపిస్తున్న తహ‌శీల్దార్ శ్రీనివాసరావు, పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుకు తరలించాలని, లారీలను పలు సెంటర్లకు పంపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి , ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Next Story