- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూతపడ్డ సర్ సిల్క్ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : సీపీఎం
దిశ, కాగజ్ నగర్ : కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని మూతపడ్డ సర్ సిల్క్ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి నూతన పరిశ్రమ స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని సీపీఐ(ఎం) నాయకులు కలెక్టర్

దిశ, కాగజ్ నగర్ : కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని మూతపడ్డ సర్ సిల్క్ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి నూతన పరిశ్రమ స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని సీపీఐ(ఎం) నాయకులు కలెక్టర్ వెంకటేష్ దోత్రె కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుశన్న రాజన్న మాట్లాడుతూ కాగజ్ నగర్ లో గత నాలుగు దశాబ్దాల క్రితం సర్ సిల్క్ మిల్లు మూతపడిందని.. ఈ మిల్లు మూసివేతతో అప్పట్లో సుమారు నాలుగు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఈ మిల్లు స్థలాన్ని ఈ వేలం వేయనున్నట్లు అఫిషియల్ లిక్విడేటర్, ప్రతినిధులు కాగజ్ నగర్ లోని పలు చోట్ల బ్యానర్లు కట్టారు. పలు పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి. ఈ మిల్లు స్థలాన్ని వేలం వేస్తే ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసి వారి వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని.. ఈ స్థలాన్ని ప్రభుత్వమే అఫిషియల్ లిక్విడేటర్ నుంచి కొనుగోలు చేయాలని కలెక్టర్ ను కోరారు.
ప్రభుత్వం ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఇక్కడ ఒక పరిశ్రమ స్థాపిస్తే కాగజ్ నగర్ పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉ పాధి కల్పించినట్లవుతుంది. అలాగే పిల్లల ఆట స్థలానికి గ్రౌండ్ కు ఇతరత్రా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో పలుసార్లు ఎన్నికల సమయంలో స్థానిక నాయకులు మూతపడ్డ సర్ సిల్క్ మిల్లు స్థలంలో నూతన పరిశ్రమ స్థాపించేందుకు కృషి చేస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని హామీలు కూడా ఇచ్చారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి తేవాలన్నారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ మిల్లు స్థలం ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఇక్కడ నూతన పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముజం ఆనంద్, దుర్గం దినకర్ పాల్గొన్నారు.






