మ‌హిషాసుర మ‌ర్ధినిగా దుర్గామాత

by Nallavelli.Anjaneyulu |

దిశ, లక్షేట్టిపేట : మున్సిపాలిటీలో పరిధిలో గల ఇటిక్యాల లో ప్రసన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గామాత అమ్మవారు ఇవాళ

మ‌హిషాసుర మ‌ర్ధినిగా దుర్గామాత
X

దిశ, లక్షేట్టిపేట : మున్సిపాలిటీలో పరిధిలో గల ఇటిక్యాల లో ప్రసన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గామాత అమ్మవారు ఇవాళ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు మహా చండీయాగం నిర్వహించారు. అనంతరం ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజల శ్రేయస్సు కోసమే ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజిస్తున్నట్టు నిర్వాహ‌కులు తెలిపారు. అనంత‌రం అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమం లో నిర్వహకులు గొల్లపెల్లి శ్రీధరాచార్యులు, రామానంద స్వామి చార్యులు భవాని దీక్ష పరులు కాంతయ్య, కిష్టయ్య, నిమ్మ రత్నాకర్, నర్సయ్య, కుమారస్వామి,సిద్ధార్థ గోపాల్, సురేష్, భాస్కర్, సందీప్ పాల్గొన్నారు.

Next Story