- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక పరిస్థితులను బట్టి అభివృద్ధికి నిధులు : రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
దిశ, ఆదిలాబాద్ : రాజ్యాంగ సవరణలకు అనగుణంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ పని చేస్తుందని, జిల్లా వారీగా వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకుంటూ అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ

దిశ, ఆదిలాబాద్ : రాజ్యాంగ సవరణలకు అనగుణంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ పని చేస్తుందని, జిల్లా వారీగా వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకుంటూ అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్, డీపీఓ, మున్సిపల్ నుంచి వస్తున్న ఆర్ధిక సౌకర్యాలను అధికారులు కమిషన్ చైర్మెన్ తో పాటు కమిషన్ కార్యదర్శి కాత్యయని దేవి, సభ్యులు ఎం. రమేష్ ముందు ఉంచారు. అయితే ఈ సమావేశానికి కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షత వహించి జిల్లా రిపోర్టును స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ లు తెలియజేశారు. ఆర్థిక వనరులను పెంచుకోవాలని ఈ సందర్భంగా కమిషన్ చైర్మెన్ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మెన్ రాజయ్య మాట్లాడుతూ..తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి కమిషన్ పర్యటిస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాంగాన్ని సవరించి ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేశారని,దానికి అనుగుణంగా కమిషన్ పని చేస్తుందని తెలిపారు. నిర్లక్ష్యానికి గురవుతున్న గ్రామపంచాయతీల గురించి తెలుసుకుంటు వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లాల వారీగా ఆర్థిక వనరుల ద్వారా సమకురుతున్న నిధుల గురించి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఆ నిధులు ఏ విధంగా వినతి పెంచుకోవాలి.. ఎలా ఖర్చు చేయాలని.. ఏ ఏ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలో చర్చించి నివేధికలను ప్రభుత్వానికి నివేధికలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్ కు వెంకటేష్ ధ్రోతే, అభిలాష అభినవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఫైజాన్ అహ్మద్, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






