ఫంక్షన్ హాల్‌లో అగ్నిప్రమాదం.. కాసేపటిలో పెళ్లి అనగా చెలరేగిన మంటలు

by Disha Web Desk 7 |
ఫంక్షన్ హాల్‌లో అగ్నిప్రమాదం.. కాసేపటిలో పెళ్లి అనగా చెలరేగిన మంటలు
X

దిశ, ప్రతినిధి నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలీ ( బి ) క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఫంక్షన్ హాల్ కిచెన్ వైపు నుంచి మంటలు చెలరేగి హాల్ పైకప్పున ఉన్న సీలింగ్‌కు మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. ఇదే మండలంలోని దని గ్రామానికి చెందిన అమ్మాయిని నిర్మల్ మండలం ముజిగి గ్రామానికి చెందిన అబ్బాయితో పెళ్లి చేసేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. పెళ్లి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉండగా ఈ ప్రమాదం 9 గంటల సమయంలో జరిగింది.

అప్పటికే కొందరు బంధువులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆ సమయంలోనే అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే బంధువులు భారీ ఎత్తున ఫంక్షన్ హాల్‌కు చేరిన తర్వాత ప్రమాదం జరిగి ఉంటే పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. అగ్ని ప్రమాదంతో అక్కడ జరగాల్సిన పెళ్లి వేరే చోటికి మార్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని ఫంక్షన్ హాల్ యాజమాన్యం చెబుతోంది. నిర్మల్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. కాగా.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది

Next Story

Most Viewed