- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తవారికే సారథ్యం.. మీనాక్షి నటరాజన్ ఫార్ములాతో కొత్త నేతల్లో ఉత్సాహం
టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫార్ములా అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కచ్చితంగా మార్చి తీరుతామని ప్రకటించారు. దీంతోపాటు పార్టీ కోసం కనీసం ఐదేళ్లు కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫార్ములా అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కచ్చితంగా మార్చి తీరుతామని ప్రకటించారు. దీంతోపాటు పార్టీ కోసం కనీసం ఐదేళ్లు కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెద్దస్థాయిలో ఏమైనా జరిగితే మినహా.. డీసీసీల మార్పు తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో పార్టీని సమర్థంగా నడిపించేవారు దొరకని పక్షంలో మాత్రమే పాతవారిని కొనసాగిస్తారని, లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు జిల్లాల డీసీసీ అధ్యక్ష బాధ్యతలు కొత్తవారికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫార్ములా ఉమ్మడి జిల్లాలో ఏ మేరకు పనిచేస్తుందన్న ప్రశ్న పార్టీలో మొదలైంది. పార్టీ కోసం ఐదేళ్లపాటు సిన్సియర్‌గా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వడమే ప్రామాణికంగా ముందుకు వెళ్తే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. లేదంటే.. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు యధావిధిగా కొనసాగే పరిస్థితులు తలెత్తితే మళ్లీ కలగూరగంప కాంగ్రెస్ అన్న పేరు నిలిచిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
- దిశ ప్రతినిధి, నిర్మల్
దిశ ప్రతినిధి, నిర్మల్ : టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫార్ములా అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కచ్చితంగా మార్చి తీరుతామని ప్రకటించడంతోపాటు పార్టీ కోసం కనీసం ఐదేళ్లు కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. పెద్దస్థాయిలో ఏమైనా జరిగితే మినహా.. డీసీసీల మార్పు తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో పార్టీని సమర్థంగా నడిపించేవారు దొరకని పక్షంలో మాత్రమే పాతవారిని కొనసాగిస్తారని, లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు జిల్లాల డీసీసీ అధ్యక్ష బాధ్యతలు కొత్తవారికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీనాక్షి ఫార్ములా ఏ మేరకు..?
టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫార్ములా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ మేరకు పనిచేస్తుందన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ముక్కుసూటి మనిషిగా పేరున్న ఆమె ఏ నిర్ణయం తీసుకున్న గాని ఏఐసీసీ అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రకటించిన మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా అధ్యక్షులను కచ్చితంగా మార్చడం, పార్టీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకపోవడం, పార్టీ కోసం కనీసం ఐదేళ్లపాటు సిన్సియర్‌గా పనిచేసిన వారికి అవకాశం ఇవ్వడమే ప్రామాణికంగా ముందుకు వెళ్తే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో సమూల మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. లేదంటే.. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు యధావిధిగా కొనసాగే పరిస్థితులు తలెత్తితే మళ్లీ కలగూరగంప కాంగ్రెస్ అన్న పేరు నిలిచిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మీనాక్షి ఫార్ములాతో తగ్గనున్న పోటీ..
తాజాగా మీనాక్షి నటరాజన్ ఫార్ములా మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం పోటీ గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తున్నది. ప్రధానంగా ఐదేళ్లపాటు పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారు ప్రస్తుతం పార్టీలో ఎక్కడ కనిపించడం లేదు. ఇదే అమలైతే పార్టీలో చాలా తక్కువ మంది పేర్లు తెరపైకి వస్తాయి. ఇలాంటి వారి పేర్లతోపాటు స్థానిక రాజకీయ అంశాలను బట్టి ఇతరులకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి తలెత్తితే అధ్యక్ష పదవులు తారుమారయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మళ్లీ స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జీలు, మంత్రి ప్రమేయం కచ్చితంగా ఉండాల్సిందేనన్న రాజకీయ మంత్రంగం కొనసాగితే తమ అనుచరులకు పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ బ్రదర్స్, ఎమ్మెల్యే ఫ్రేమ్‌సాగర్ నడుమ తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ దండే విట్టల్ ప్రత్యేక వర్గాన్ని నడుపుతున్నారు. తాజా పరిణామాలు అక్కడ ఒక్కసారిగా మారినట్లు ప్రచారం మొదలైంది. నిర్మల్ జిల్లాలో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా నారాయణరావు పటేల్, విట్టల్ రెడ్డి వర్గాలు నువ్వా.. నేనా అన్నట్టుగా నడుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కొంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న వర్గం, సస్పెండ్ అయ్యి తిరిగి పార్టీలో చేరిన వర్గం నడుమ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి పార్టీ పరిశీలకులు అజయ్ సింగ్, మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
తొలుత అబ్జర్వర్లకు పరీక్ష...
విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు జిల్లాలకు వచ్చిన కాంగ్రెస్ అబ్జర్వర్లకు అధిష్టానం ముందుగా పరీక్ష పెడుతున్నట్లు తెలిసింది. దరఖాస్తులు స్వీకరించిన వారి పూర్తి వివరాలను వారి నుంచి సేకరిస్తారని తెలుస్తోంది. ఒక్కో జిల్లా నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే జిల్లాల్లోనే వడపోసి తమకు ఇవ్వాలని అబ్జర్వర్లకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. వడపోత తర్వాత ఇచ్చే ఆరుగురు అభ్యర్థుల అర్హతలను అధిష్టానం అబ్జర్వర్ల నుంచి సమీక్షిస్తారని ఆ తర్వాతనే కొత్త అధ్యక్షులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇదంతా జరగడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.






