ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్

by Taduka Kalyani |   (  Updated:2025-07-19 16:38:43  IST  )

మండలంలోని గోపాల్ నగర్ గ్రామపంచాయతీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్యను సస్పెండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా డిఆర్డిఓ అధికారి కిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
X

దిశ, తాండూర్ : మండలంలోని గోపాల్ నగర్ గ్రామపంచాయతీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్యను సస్పెండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా డిఆర్డిఓ అధికారి కిషన్ ఉత్తర్వులు జారీ చేశారు. గోపాల్ నగర్ విధుల్లో నిర్లక్ష్యం, నర్సరీ నిర్వహణ, మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేయడం వలన మొక్కలు ఎండిపోయినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ పై ఫిర్యాదులు అందాయి. దీంతో ఇటీవల డి ఆర్ డి ఎ ప్లాంటేషన్ మేనేజర్ క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపారు. నర్సరీ నిర్వహణ లోపం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం వలన మొక్కలు ఎండిపోయాయని విచారణలో తేలింది. దీంతో ప్లాంటేషన్ మేనేజర్ ఫీల్డ్ అసిస్టెంట్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు.

Next Story