ఉపాధి హామీలో అక్ర‌మాల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు : డీఆర్డీఓ విజ‌య‌ల‌క్ష్మీ

by Ratna Kumari |

దిశ‌, ముధోల్ : మ‌హాత్మ‌గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలకు సిబ్బంది పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ విజయలక్ష్మి హెచ్చరించారు.

ఉపాధి హామీలో అక్ర‌మాల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు : డీఆర్డీఓ విజ‌య‌ల‌క్ష్మీ
X

దిశ‌, ముధోల్ : మ‌హాత్మ‌గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలకు సిబ్బంది పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఆర్డీఓ విజయలక్ష్మి హెచ్చరించారు. గురువారం మండల కేంద్రమైన ముధోల్ లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 15వ సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆమె పాల్గొన్నారు. మండలంలోని 19 గ్రామపంచాయతీలో ఈజీఎస్- పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కూలీ పనులతో పాటు మెటీరియల్ పేమెంట్ కింద మొత్తం రూ.8 కోట్ల 76 లక్షల పనులు చేపట్టారు. సామాజిక తనిఖీ బృందాలు 2024- 25 సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వివరాలను సేకరించారు. అలాగే పనులకు వెళ్లిన కూలీలను నేరుగా కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో నిర్వహించిన గ్రామసభల్లో సామాజిక తనిఖీ బృందాలు గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికలు చదివి వినిపించారు. సామాజిక తనిఖీ బృందాలు మండల స్థాయిలో నిర్వహించిన ప్రజావేదికలు గ్రామాల వారీగా నివేదికలను చదివి వినిపించారు. మొత్తం ఉపాధి హామీలో కూలీ పనులకు రూ 4 కోట్ల 60 లక్షలు కేటాయించారు.

పంచాయతీరాజ్ శాఖకు మెటీరియల్ పనుల కింద రూ3 కోట్ల 98 లక్షల రూపాయలను కేటాయించి పనులు చేపట్టారు. చేపట్టిన పనులకు సంబంధించి బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి వివరాలను సేకరించారు. గ్రామాల్లో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకరికి బదులు మరొకరు పనులు చేపట్టడంతో పాటు ఒకే కుటుంబానికి రెండు జాబ్ కార్డులను అందించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులకి పెద్ద మొత్తంలో లబ్ధిచేకూర్చే విధంగా సిబ్బంది వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో వేల సంఖ్యలో నాటిన మొక్కలు ఎండిపోవడం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు చేయని పనులకు ఖాతాల్లో డబ్బులు వేయడం పట్ల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం ఉందన్నారు. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి పనులు చేపట్టాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. దీంతో బాద్యులైన ఫీల్డ్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అధికారులు సైతం తమ తీరును మార్చుకోవాలన్నారు. పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మండల వ్యాప్తంగా సిబ్బంది నుంచి రూ.87, 194లు రికవరీ చేయాలని ఆదేశించారు. ఇకనైనా తీరును మార్చుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు. డీఆర్డీఓ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉపాధి పనుల్లో పారదర్శకత, జవాబుదారితనానికి ప్రాధాన్య‌త‌ ఇస్తున్నామన్నారు. సిబ్బంది సైతం బాధ్యతతో పనిచేయాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు చేపట్టిన పనులకు సంబంధించి రికార్డులను సామాజిక తనిఖీ బృందాలకు ఇవ్వలేదు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లవ కుమార్, ఎంపీఓ శివకుమార్, ఏపీఒ శిరీష రెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్, విజిలెన్స్ ఆఫీసర్ నర్సయ్య, ఎస్ఆర్పి మహేష్, స్టేట్ టీమ్ మానిటరింగ్ ప్రోగ్రాం మేనేజర్ అశోక్, దత్తు, స్థానిక నాయకులు, ఉపాధి సిబ్బంది, పాల్గొన్నారు.

Next Story