- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ
అందజేసిన ఎమ్మెల్యే, అడిషనల్ కలెక్టర్
దిశ,భైంసా : పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో శనివారం దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ హాజరై అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ ఉపకరణాల అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపరంగా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం సీపీ చైర్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు, టీఎల్‌ఎం కిట్లు అందజేసిందన్నారు. రూ.47లక్షలు ఖరీదుచేసే ఉపకరణాలను అందజేశామన్నారు. ఇది కేవలం ఉపకరణాల పంపిణీ మాత్రమే కాదని, ఇది సాధికారత వైపు వేసిన ఒక గొప్ప అడుగని, ఈ పరికరాలు చైతన్యం, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయన్నారు.






