- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అభివృద్ధి సాధ్యపడుతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జర్మనీ దేశంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కార్మిక భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

దిశ, చెన్నూర్ : కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అభివృద్ధి సాధ్యపడుతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జర్మనీ దేశంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కార్మిక భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్ వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్ వాడీ టీచర్లకు అందిస్తున్న సెల్ ఫోన్లను సద్వినియోగం చేసుకొని విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుతుందని ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి లబ్ది దారులకు అందుతున్నాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్మును వృథా చేసి కల్వకుంట్ల కుటుంబం కోట్లు సంపాదించారని ఆయన అన్నారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తాను తెచ్చిన నిధులే ఇప్పుడు ఖర్చు చేస్తున్నారని అనడం సిగ్గుచేటు అన్నారు. అప్పుడు నిధులు ఉంటే అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఎందుకు వదిలేసారో చెప్పాలన్నారు. కేవలం సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడానికి జర్మనీ సంస్థ టామ్ కామ్ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని.. యువకులు జర్మనీలో ఉపాధి పొందాలంటే క్యాంపు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపాధి పొందాలని సూచించారు. అనంతరం 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మా శ్రీనివాస్, వైస్ చైర్మన్ వినయ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






