ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత.. రక్షణ అధికారి ఓదెలు

by Disha Web Desk 20 |
ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత.. రక్షణ అధికారి ఓదెలు
X

దిశ, కాసిపేట : సింగరేణి లోని భూగర్భ గనులలో ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విధిగా ఉద్యోగులు, అధికారులు రక్షణ సూత్రాలను పాటిస్తూ, ప్రమాద రహిత ఉత్పత్తికై పాటుపడాలని ఏరియా రక్షణాధికారి ఓదేలు పేర్కొన్నారు. మంగళవారం మందమర్రి ఏరియాలో కాసిపేట గనిపై నిర్వహించిన రక్షణ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదాల నివారణకు యాజమాన్యం పకడ్బందీ రక్షణ చర్యలు చేపడుతుందని తెలిపారు. గనిలోని పని స్థలాలను సూపర్వైజర్లు పరిశీలించిన అనంతరమే ఉద్యోగులను పనులకు పురమాయించాలని సూచించారు.

గనిలోని రూఫ్ ను, సైడ్ లను తప్పనిసరిగా పరిశీలిస్తూ ఉండాలన్నారు. విధిగా రక్షణ సూత్రాలను పాటించడం ద్వారా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. కాసిపేట గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రమాదాలు లేని సంస్థగా ఇతర సంస్థలకు ఆదర్శంగా ఉండేలా ఉద్యోగులు, అధికారులు అనే తేడా లేకుండా సమిష్టిగా రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. ప్రతిరోజూ ఉద్యోగులకు రక్షణపై అవగాహన పెంచడం సూపర్వైజర్ బాధ్యత అని పేర్కొన్నారు.

ఏరియాలో రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రక్షణ సూత్రాలు విస్మరించడం, తొందరపాటుతో పనులు చేయడం ద్వారానే ప్రమాదాలు సంభవిస్తాయనే విషయాన్ని పదేపదే వెల్లడించాలని సూచించారు. కాసిపేట గని మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ ప్రతి రోజు, ప్రతి క్షణం గనిలో, బయట రక్షణ, భద్రతతో ఉండాలని మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం, సంస్థ బాగుంటుందని అన్నారు. ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాగం మల్లేష్, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రెటరీ దూట శ్రీనివాస్ లు రక్షణ అవగాహన గురించి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.

అనంతరం రక్షణ అవగాహన పై సరైన సమాధానం చెప్పిన వారికి మైనింగ్ సర్దార్ నాగేశ్వర్ రావ్, ఏఎస్ ఓ ఓదేలు, ఏజెంట్ కుర్మ రాజేందర్, మేనేజర్ అల్లావుద్దీన్, నాయకులు మల్లేష్, శ్రీనివాస్ లు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో గని రక్షణ అధికారి సునీల్ కుమార్, శాంతిగని రక్షణ అధికారి రాజు, ఫిట్ ఇంజనీర్ బాబు, ఇంజనీర్లు మధుకర్, అనిల్, అండర్ మేనేజర్ నిఖిల్, సర్వేయర్ వేంకటేశ్వర్ రావ్, వర్క్ ఇన్స్పెక్టర్లు సోల్లంకి శ్రీనివాస్, మీనుగు లక్ష్మినారాయణ, అబ్దులుద్దీన్, గని అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed