పత్తి వాహనం బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

by Ratna Kumari |

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని కొత్త కరత్వాడ పట్నాపూర్ గ్రామాల మధ్య సోమవారం సాయంత్రం పత్తి లోడ్ తో ఉన్న వాహనం బోల్తా పడిన ఘటన మండలం లో చోటు చేసుకుంది.

పత్తి వాహనం బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని కొత్త కరత్వాడ పట్నాపూర్ గ్రామాల మధ్య సోమవారం సాయంత్రం పత్తి లోడ్ తో ఉన్న వాహనం బోల్తా పడిన ఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్లపెల్లి నుంచి బోథ్ కు పత్తి లోడ్ తో వేగంగా వస్తున్న వాహనం కొత్త కరత్వాడ సమీపంలో పల్టీ లు కొట్టి పత్తి మొత్తం చెల్లా చేదురుగా పడిపోయింది. వాహనంలో ఉన్న రైతు సుభాష్ మరొకరు సాయి కుమార్ కు తీవ్ర గాయాలు కావడం తో స్థానికులు 108 అంబులెన్సు లో బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి కి తరలించారు. ఈ విషయం తెలిసి ఘటన స్థలానికి ఎస్సై శ్రీ సాయి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుని విచారణ చేపట్టారు.

Next Story