ఐడియా అదుర్స్.. క‌ల‌ర్ పుల్ చీర‌లతో ప్లాంటేష‌న్..!

by Ratna Kumari |

దిశ, కుబీర్ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బెల్గాం తండా గ్రామపంచాయతీలో ఓల్డ్ కలర్ పుల్ చీరాలతో ప్లాంట్స్ ను కాపాడుకునేందుకు ఉపయోగించిన తీరును చూస్తే ఐడియా

ఐడియా అదుర్స్.. క‌ల‌ర్ పుల్ చీర‌లతో ప్లాంటేష‌న్..!
X

దిశ, కుబీర్ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బెల్గాం తండా గ్రామపంచాయతీలో ఓల్డ్ కలర్ పుల్ చీరాలతో ప్లాంట్స్ ను కాపాడుకునేందుకు ఉపయోగించిన తీరును చూస్తే ఐడియా అదిరింది చెప్ప‌వ‌చ్చు. . వన మహోత్సవంలో భాగంగా ఉపాధి హామీ పథకంలో రోడ్డు కు ఇరు ప్రక్కల మొక్కలు నాటారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పంచాయతీ ఇది. సమీప అడవి ప్రాంతంలో దొరికిన కట్టెలను తీసుకొచ్చి.. నాటిన మొక్కల‌కు మూడు వైపులా కర్రలను పాతారు. అలాగే చీరను దాని చుట్టూ కట్టి మొక్కలను రక్షిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను, మరి కొన్ని ఇతర పాత చీరలతో ప్లాంట్స్ ను ఇలా కాపాడుకుంటున్నారు. పచ్చని ప్రకృతిలో కలర్ పుల్ చీరలు భలే పసందు గా కనిపించ‌డం విశేషం.

Next Story