సీఎం రేవంత్,పాయల్ శంకర్ ది చీకటి ఒప్పందం..!

by Nallavelli.Anjaneyulu |

ఆదిలాబాద్ మున్సిపాలిటీ సెక్యూలర్ పార్టీల ఆధీనంలోనే ఉందని, స్వతంత్ర అభ్యర్థికే తమ సంపూర్ణ మద్దతు తెలిపామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.

సీఎం రేవంత్,పాయల్ శంకర్ ది చీకటి ఒప్పందం..!
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీ సెక్యూలర్ పార్టీల ఆధీనంలోనే ఉందని, స్వతంత్ర అభ్యర్థికే తమ సంపూర్ణ మద్దతు తెలిపామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.21 స్థానాలు ఉన్న బీజేపీ ముగ్గురిని కూడబెట్టుకోలేక పోవడం దేనికి నిదర్శనమని ఈ సందర్భంగా మాజీమంత్రి ప్రశించారు. మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేసే ఉద్దేశం లేకనే ఎమ్మెల్యే ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదన్నారు. అక్రమ సంపాదనలు కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డికి గురుదక్షిణగా మున్సిపాలిటీని ఇచ్చారని ఆరోపించారు.నాగపూర్ క్యాంప్ నుంచి స్వతంత్ర అభ్యర్థిని వదిలిపెట్టారని ఆరోపించారు.స్వతంత్ర అభ్యర్థి అయిన బండారి అనూషకు తాము మద్దతుగా నిలిచామని,కాంగ్రెస్ జెండా కప్పుకోనని స్పష్టం చేయడంతోనే మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.

Next Story