- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివాసీలతో సీఎల్పీ నేత భట్టి ఉగాది వేడుకలు..
by Batti.Sumithra |
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బారేమోడీ గ్రామంలో బుధవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివాసీలు, రైతులతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు.

X
దిశ, తాండూర్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బారేమోడీ గ్రామంలో బుధవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివాసీలు, రైతులతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఉగాది పండగ రోజు హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎడ్లకు,నాగలికి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేసి నాగలితో భూమినిదున్నారు.
అనంతరం ఆదివాసీలు, పార్టీ నాయకులతో కలిసి భట్టి సహాపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని తెలుగు ప్రజలు శోభకృతనామ సంవత్సరంలో సుఖ సంతోషాలతో గడపాలన్నారు. రైతులతో కలిసి ఉగాది పర్వదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఆయన ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






