బాలికల హక్కులు కాపాడటం అందరి బాధ్యత : బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్

by Ratna Kumari |

దిశ, ఆదిలాబాద్: బాలికల హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో

బాలికల హక్కులు కాపాడటం అందరి బాధ్యత : బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్
X

దిశ, ఆదిలాబాద్: బాలికల హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని ష్యూర్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..ఆడపిల్లల రక్షణ, సంరక్షణ కోసం ఒక వ్యవస్థనే పని చేస్తుందన్నారు. వారి కోసం ప్రత్యేకంగా జేజేబీ కోర్టు, చైల్ట్ లైన్, ఐసీపీఎస్, ష్యూర్ ఎన్జీవో పని చేస్తున్నాయని తెలిపారు. ఆపదలో ఉన్నవారు ఎవరికి భయపడకుండా డయల్ 1098, 100 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, క్రీడా పాఠశాల కోచ్ కబిర్ దాస్, డీసీపీయూ కౌన్సిలర్ పద్మ, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ వెంకటేష్, ష్యూర్ ఎన్జీవో ఫీల్డ్ సూపర్ వైజర్లు కిరణ్, సౌజన్య పాల్గొన్నారు.

Next Story