ఈకేవైసీ తో నకిలీ రేషన్ కార్డులకు చెక్

by Ratna Kumari |

దిశ, మంచిర్యాల : జిల్లాలో రేషన్ కార్డు దారులందరూ ఈకేవైసీ చేయడంతో నకిలీ రేషన్ కార్డులకు చెక్ పడుతుందని అదనపు కలెక్టర్ పి.

ఈకేవైసీ తో నకిలీ రేషన్ కార్డులకు చెక్
X

దిశ, మంచిర్యాల : జిల్లాలో రేషన్ కార్డు దారులందరూ ఈకేవైసీ చేయడంతో నకిలీ రేషన్ కార్డులకు చెక్ పడుతుందని అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అవుతుందన్నారు. ఆహార భద్రత చట్టం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈకేవైసీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కేవైసీ ద్వారా లబ్ధిదారులను గుర్తించి 100శాతం ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేవైసీ చేసుకునేందుకు రేషన్ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులు తమ వేలిముద్రలను వేయాల్సి వస్తుందన్నారు. ఆయా పరిధిలోని రేషన్ షాపుల్లో ఈ పోస్ యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

Next Story