- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల ప్రయోజనాలు అవసరం లేదు : కేటీఆర్
దిశ, భైంసా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి రైతుల ప్రయోజనాలు అక్కర్లేదని..కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం

దిశ, భైంసా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి రైతుల ప్రయోజనాలు అక్కర్లేదని..కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి, రైతులతో మాట్లాడారు. అధిక వర్షాల నేపథ్యంలో రైతులు చాలా నష్టపోవాల్సి వచ్చిందని, ఇది చాలాదన్నట్లు పంటలు అమ్మే క్రమంలో తేమ శాతం అంటూ ఇబ్బంది పెడుతున్నరన్నారు. మేము అధికారంలో ఉన్న సమయంలో నవంబర్ నాటికి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరంగా ఐదు లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిపామని గుర్తు చేశారు. ప్రస్తుతం లక్ష క్వింటాళ్ల పత్తి కూడా కొనుగోలు జరగలేదన్నారు. ఎకరానికి 12 క్వింటాళ్ళ పత్తి, సోయ కొనుగోలు జరపాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రుణమాఫీ, యూరియా కొరత లాంటివి లేవని నేడు అన్ని సమస్యలేనని అన్నారు. ఇక్కడి ప్రాంతంలో ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్న రైతులపై పట్టింపు లేదన్నారు. రైతులు అధైర్య పడద్దని, అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జోగు రామన్న, జాన్సన్ నాయక్, అనిల్ జాదవ్, ముధోల్ సమన్వయ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, రమాదేవి, విలాస్ గాదేవర్ పాల్గొన్నారు.






