ఇక్కడి సంక్షేమ పథకాలు భారత దేశ ప్రజలను ఆకర్షించాయి.. బీఆర్ఎస్ నాయకులు

by Disha Web |
ఇక్కడి సంక్షేమ పథకాలు భారత దేశ ప్రజలను ఆకర్షించాయి.. బీఆర్ఎస్ నాయకులు
X

దిశ, చింతలమానేపల్లి : భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పార్టీగా, ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా ముఖ్యమంత్రి ప్రకటించిన సందర్భంగా బుధవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రం శివాజీ చౌరస్తాలో నాయకులు సంబరాలు జరిపారు. బాణాసంచ పేల్చి మిఠాయిలు పంపిణి చేసి, దేశ్ కి నేత కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలను హోరెత్తించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డుబ్బుల వెంకయ్య, రైతు సమన్వయ సమితి మండల కమిటీ అధ్యక్షులు బింకరి నారాయణ మాట్లాడుతూ యావత్ దేశ ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.

29 రాష్ట్రాలల ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. సంక్షేమ పథకాలు భారత దేశ ప్రజలను ఆకర్షించి కేసీఆర్ కు మద్దతు పలుకుతున్నారని అన్నారు. రాబోయే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికి అత్యధిక సీట్లు కైవాసం చేసుకుంటుందని అన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తి భారత దేశానికి ప్రధాని అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు భారతదేశ రైతులకు కూడా అందుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, ఎంపీటీసీ జాబారి రాజన్న, తాజా మాజీ ఉప సర్పంచ్ ఉప్పులం మహేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డుబ్బుల వెంకయ్య, మండల రూపకర్త రత్నం పాపయ్య, రైతు సమన్వయ సమితి మండల కమిటీ అధ్యక్షులు బింకరి నారాయణ, సహకార సొసైటీ బ్యాంక్ వైస్ చైర్మన్ టోబ్రే మారుతి, మైనార్టీ మండల సెల్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ హుస్సేన్, నందిపేట రామయ్య, టోబ్రే సురేష్, రషీద్, గాట్లే శంకర్, నిట్టూరు సత్తయ్య, ప్రకాష్, విలాస్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed