మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాల పై చర్చకు సిద్దం..

by Disha Web Desk 20 |
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాల పై చర్చకు సిద్దం..
X

దిశ, సోన్ : మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై నిర్మల్ నియోజకవర్గంలో సాగిస్తున్న భూ కబ్జాలపై భారతీయ జనతాపార్టీ ఆధారాలతో సహా చర్చకు సిద్దం అని పేర్కొన్నారు. దమ్ముంటే టైం డేట్ ప్లేస్ ఫిక్స్ చేయాలని సవాలు విసిరారు. సీఎం కాళ్ళు మొక్కి మంత్రిపదవిని ఇంద్రకరణ్ రెడ్డి తెచ్చుకున్నారని, అదే బాటలో గండ్రత్ ఈశ్వర్ మంత్రి కాళ్ళు మొక్కి మున్సిపల్ చైర్మెన్ పదవి తెచ్చుకున్నారని తెలిపారు. రావుల రాంనాథ్ ని విమర్శించే స్థాయి ఈశ్వర్ది కాదని ఆయన లాగా పార్టీలు మారిన వ్యక్తి కాదన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం రెండుసార్లు ప్రాణాలు అడ్డం పెట్టిన వ్యక్తి రాంనాథ్ అని అన్నారు.

గత 40 సంవత్సరాల నుండి ఒకే పార్టీలో ఉన్న వ్యక్తి అని నిరంతరం ప్రజాసమస్యల పై పోరాడే వ్యక్తి అని సామాన్య కుటుంబం నుంచి ఈ రోజు రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వ్యక్తి అని విలేకరుల సమావేశంలోపేర్కొన్నారు. వెంటనే బీజేపీ నాయకులు రావుల రామనాథ్ కి నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేసారు. బీజేపి నిర్మల్ మున్సిపాలిటీని గతంలో కైవసం చేసుకున్న విషయం ఈశ్వర్ కి తెలియదేమోనని గుర్తు చేశారు. ఈశ్వర్ కౌన్సిలర్గా గెలవనని భావించి కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి తప్పించి దొడ్డి దారిన ఏకగ్రీవం అయ్యాడే తప్ప ప్రజామద్దతుతో కాదని తెలిపారు.

అవినీతిలో తెలంగాణలో నిర్మల్ మున్సిపాలిటీని అగ్రస్థానంలో నిలిపిన ఘనత నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ దేననితెలిపారు. మున్సిపాలిటీలో ఉద్యోగాలు అమ్ముకొని దోచుకున్న దొంగ ఈశ్వర్ అని, సొంత కూతురు అల్లుడికి, దగ్గర బంధువులకు ఉద్యోగాలు ఇప్పించుకున్న ఘనుడు ఈశ్వర్ అని పేర్కొన్నారు. దమ్ముంటే ఇప్పుడు రాజీనామ చేసి ఎన్నికలకు ముందుకు రావాలని భారతీయ జనతా పార్టీ ఈశ్వర్ ని తప్పకుండా ఓడిస్తుందని తెలిపారు. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆక్రమణలపై బీజేపి చేసిన ఆరోపణలు వాస్తవాలేనని పేర్కొన్నారు.

కేవలం మంత్రి ఫాం హౌస్ కోసమే 50 లక్షలతో రోడ్డు నిర్మాణం చేయడం సిగ్గుచేటని నిజానికి గోదావరి ఘాట్ రోడ్డు వేరే ఉందని తెలిపారు. గోదావరి తీర ప్రాంతం బఫర్ జోన్ అని ఎలాంటి నిర్మాణాలు చేయవద్దు కాని మంత్రి అ విధంగా ఫాం హౌస్ నిర్మించారని పేర్కొన్నారు. వెంటనే మంత్రి పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, మండల అధ్యక్షుడు మ్యక, ప్రేమ్ కుమార్, గిరిజన మోర్చా అధ్యక్షుడు సుంకరీ, ముత్యం, మోతుకుపల్లి , నరేష్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed