స్పెయిన్, పోర్చుగల్‌లో భారీ ఉల్కాపాతం.. అర్ధరాత్రి ని పట్టపగలు గా మార్చిన వెళుతురు (వీడియో)

by Mahesh |
స్పెయిన్, పోర్చుగల్‌లో భారీ ఉల్కాపాతం.. అర్ధరాత్రి ని పట్టపగలు గా మార్చిన వెళుతురు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఆకాశం నుంచి భారీ ఉల్కలు నేల రాలుతాయని మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ నిజ జీవితంలో అలంటి సంఘటనలు జరగడం చాలా అరుదు. వందలు, వేల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ ఉల్కాపాతం సంభవిస్తుంటుంది. అయితే తాజాగా స్పెయిన్, పోర్చుగల్‌లో దేశాల్లో నిన్న రాత్రి భారీ ఉల్కాపాతం సంభవించింది వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వీడియోలో రాత్రి సమయంలో భారీ ఉల్క ఒకటి ఆకాశం నుంచి అత్యంత వేగంగా భూమి మీదకు దూసుకొచ్చింది. అలాగే కన్లు మిరమిట్లు కొలిపే వెలుగును విరజిమ్ముతూ వచ్చిన ఈ ఉల్కాపాతం వల్ల అర్ధరాత్రి సమయం కూడా ఒక్కసారిగా పగటి సమయంలా మారిపోవడం ఆ వీడియోలో కనిపించింది.

అయితే ఈ భారీ ఉల్కాపాతం భూమి యొక్క ఉపరితలంపై తాకిందో లేదా అనే విషయాన్ని ధృవీకరించబడలేదు. అయితే కొన్ని నివేదికలు అది కాస్ట్రో డైర్ పట్టణానికి సమీపంలో పడిపోయి ఉండవచ్చుని, పిన్‌హీరోకి దగ్గరగా ఉందని చెబుతున్నాయి." NASA ప్రకారం, "ఉల్కలు భూమి యొక్క వాతావరణంలోకి (లేదా మార్స్ వంటి మరొక గ్రహం) అధిక వేగంతో ప్రవేశించి కాలిపోయినప్పుడు, ఫైర్‌బాల్స్, "షూటింగ్ స్టార్‌లను" ఉల్కలు అంటారు. ఉల్కలు, అంతరిక్షంలోని రాళ్లు, దుమ్ము రేణువుల నుంచి పరిమాణంలో ఉంటాయి. కాగా ఈ ఉల్కను చూసిన ఓ వ్యక్తి.. "ఇది నేను చూసిన అత్యంత క్రేజీ ఉల్కా ఫుటేజ్. ఇది వ్యక్తిగతంగా చూడటం మనసుకు హత్తుకునేలా ఉందని నేను పందెం వేస్తున్నానని ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చాడు.

Click Here For Twitter Post..

Next Story