బిర్షా ముండా స్పూర్తితో ఉద్య‌మించాలి : తుడుందెబ్బ మండ‌ల అధ్య‌క్షులు చిత్రు

by Ratna Kumari |

దిశ‌, ఇంద్ర‌వెల్లి : భూమి, భుక్తి విముక్తి కోసం తుపాకీ పట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు బిర్సా ముండా ను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని తుడుం దెబ్బ

బిర్షా ముండా స్పూర్తితో ఉద్య‌మించాలి : తుడుందెబ్బ మండ‌ల అధ్య‌క్షులు చిత్రు
X

దిశ‌, ఇంద్ర‌వెల్లి : భూమి, భుక్తి విముక్తి కోసం తుపాకీ పట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు బిర్సా ముండా ను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని తుడుం దెబ్బ మండల అధ్యక్షులు పుర్కా చిత్రు పేర్కొన్నారు. శనివారం మండలకేంద్రంలోనీ ఆదివాసీ అమరవీరుల స్తూపం వద్ద ఉన్న ఆదివాసీ భవనంలో ఆయన 150 వ జయంతిని ఆదివాసీ నాయకులు కలసి ఘనంగా నిర్వహించారు. ముందుగా బిర్సా ముండా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి హక్కుల కోసం ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసిన బిర్సా ముండా ను స్ఫూర్తి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాగల్ జెండా చైర్మన్ తొడసం నాగోరావు, ఆదివాసేన మండల అధ్యక్షులు మెస్రం సుదర్శన్, తుడుం దెబ్బ జిల్లా కోశాధికారి కోట్నాక్ బారిక్ రావ్, జిల్లా ఉపాధ్యక్షులు గెడం భారత్, గౌరవ అధ్యక్షులు జుగ్నాక్ భారత్, రాజ్ గోండ్ సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సోయం రాందాస్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొడప శ్రీకాంత్,నాగోబా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మెస్రం తుకారాం పాల్గొన్నారు.

Next Story