- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : భూక్య జాన్సన్ నాయక్
దిశ, ఉట్నూర్ : మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని.. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు.

దిశ, ఉట్నూర్ : మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని.. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి, బిర్సాయిపేట్ గ్రామాలకు చెందిన దాదాపు 200మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు , బీఆర్ఎస్ పార్టీలో భూక్య జాన్సన్ నాయక్ సమక్షంలో చేరారు. వారికి గులాబీ ఖండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన కేవలం బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం తప్ప అభివృద్ధి చేసింది మాత్రం శూన్యమన్నారు. ఇకనైన చౌకబారు రాజకీయాలు మానుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పని చేద్దామని, ఈ చేరికలతో పార్టీ మరింత బలపడుతుందని ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా క్షేత్రంలో అహర్నిశలు కృషి చేస్తామన్నారు.






