రాష్ట్రంలో భూ భారతి చట్టం ఓ సంచలన నిర్ణయం : మంత్రి పోంగులేటి

by Bhanu |

రాష్ట్రంలో భూ భారతి చట్టం ఓ సంచలన నిర్ణయమని,ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో భూ భారతి చట్టం ఓ సంచలన నిర్ణయం : మంత్రి పోంగులేటి
X

దిశ, భైంసా : రాష్ట్రంలో భూ భారతి చట్టం ఓ సంచలన నిర్ణయమని,ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కుంటాల మండలంలొ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలొ పాల్గొనీ మాట్లాడారు....గత ప్రభుత్వంలొ ధరణి చట్టం ద్వార అనేక ఇబ్బందులు పడ్డ తెలంగాణ రైతుల కష్టాన్ని చూసి ఈ చట్టాన్ని అమల్లొకి తెచ్చిందని, పొలంభూమి అనేది మనిషి జీవితంలో ఒక ఎమోషనల్ అంశంమని దాన్ని పకడ్బందిగా భూ భారతి నిర్వహిస్తున్నారు.గత ప్రభుత్వం ధరణి లో తప్పులతో రికార్డులు మారిపోయాన్నారు. కొంత మంది కోర్టు కు వెళ్ళి అసలైన రైతుల భూములను లాక్కున్న పరిస్థితినీ గత ప్రభుత్వం చేసిందన్నారు.భూ సమస్యలకు అన్నిటికి పరిష్కారం జూన్ 2 న భూ భారతి తీరుస్తుందనీ తెలిపారు.


ఇందిరమ్మ రాజ్యం వచ్చాక భూభారతి పైలట్ ప్రాజెక్టు ద్వారా13 రెవెన్యూ గ్రామంలో 3 టీమ్ కు ఏర్పాటుచేసి ఆనాటి ధరణిలో వివిధ కారణాల చేత ప్రజలకు మంచి చేసే విధంగా భూములున్న వారికి రక్షణగా భూభారతి చట్టం తీసుకొచ్చమని తెలిపారు.ధరణి వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారనీ అన్నారు.భూభారతీ ద్వార రైతులు తమ సమస్యలను స్థానికంగానె పరిష్కరించుకునె సౌకర్యం ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పేదవారికి అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకొసం ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తుందని తెలిపారు. అనంతరం భూ భారతి ద్వారా సమస్యలు పరిష్కరమైన రైతులకు మంత్రి పత్రలను అందజేశారు.నిర్మల్ జిల్లాలొని సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కి సైతం సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి, మంత్రి సీతక్క,నవీన్ మిట్టల్,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story