- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 27న ఎరువుల దుకాణాల బంద్
ఈ నెల 27న దేశవ్యాప్తంగా నిర్వహించే బంద్‌కు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేస్తామని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు.

దిశ, ఆదిలాబాద్ రూరల్ : ఈ నెల 27న దేశవ్యాప్తంగా నిర్వహించే బంద్‌కు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేస్తామని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామికి సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి శివప్రసాద్ మాట్లాడుతూ.. ఎరువుల కంపెనీల విధానాలకు నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎరువుల ధరలు పెరగడం, లింక్ ఉత్పత్తుల వల్ల రైతులపై అదనపు భారం పడుతోందని, రవాణా ఖర్చులతో డీలర్లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుని ఎరువుల ధరలు తగ్గించాలని, రైతులకు అవసరమైన ఎరువులు మాత్రమే అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి రమేష్ రెడ్డి, ఎల్టీ రాకేష్ రెడ్డి, సందేశ్, నెల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.






